![]() |
![]() |
.webp)
సెలబ్రిటీలు ఏం చేసిన ట్రెండింగ్ అవుతాయి. అయితే వీరిలో కొందరు అందంతో, మరికొందరు రీల్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. సినిమా ఆడియో రిలీజ్ లకి, బుల్లితెరపై ప్రసారమయ్యే టీవీ షోలకి యాంకరింగ్ చేసే యాంకర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఫీమేల్ యాంకర్స్ లో సుమ, అనసూయ, రష్మి తర్వాత ఎవరు అంతగా పేరు తెచ్చుకోలేకపోయారు. అనసూయ ఎప్పుడైతే యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పేసిందో అప్పటి నుంచి కొత్త యాంకర్లకి ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. అందులో యాంకర్ స్రవంతి ఒకరు.
యాంకర్ స్రవంతి.. పూర్తిపేరు చొక్కారపు స్రవంతి. ఈ బ్యూటీ తాజాగా యాంకరింగ్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకి యాంకరింగ్ చేస్తుంది. అలానే అవకాశం ఉన్న ప్రతి సారి కొన్ని టీవీల పండగ షోస్‌లో కూడా మెరుస్తుంది. సంతోషం అవార్డ్స్ 2023'.. కి యాంకర్ గా చేస్తున్నట్టు ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా హీరో నానితో రీల్ చేసి మరో వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దానికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి.
ఎప్పుడు ఫోటో షూట్, రీల్స్ అంటూ ఏదో ఒకటి షేర్ చేస్తూ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా గోవా బీచ్ లో బ్యూటీ నెటిజన్లకి హాట్ ట్రీట్ ఇచ్చింది. వలలాంటి పొట్టి డ్రెస్ తో కుర్రకారుని వలలో పడేస్తుంది. గోవా బీచ్ లోని ఇసుకపై కూర్చొని అందాలు ఆరబోయడంతో.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. " జస్ట్ ఏ టాన్ టాస్టిక్ డే " అంటూ ఈ పోస్ట్ కి టైటిల్ కూడా ఇచ్చేసుకుంది ఈ బ్యూటీ. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ వైరల్ గా మారింది.
![]() |
![]() |